Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించండి..! 20 d ago
జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ప్రశ్నించింది. రోజువారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని మండిపడింది. ఏ,ఏ కోర్టులలో ఏ,ఏ కేసులు దాఖలయ్యాయి..వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత ఏం చేయాలో చెబుతామని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.